ఓవర్సీస్ లో హనుమాన్ కొత్త రికార్డులు

Update: 2024-01-16 13:14 GMT

Full Viewహనుమాన్ సినిమా సంచలనం సృష్టించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా విడుదల అయిన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో ఈ సినిమా చరిత్ర సృష్టించినట్లు అయింది. అతి తక్కువ థియేటర్లు, కనీస టికెట్ ధరలతోనే ఈ రికార్డు నమోదు చేయటం విశేషం. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఓవర్సీస్ మార్కెట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను తేజ సజ్జ హనుమాన్ బీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో ఇప్పటివరకు హనుమాన్ ఏకంగా మూడు మిలియన్ డాలర్స్ సాధించినట్లు చెపుతున్నారు. ఇప్పటికి పలు చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో హనుమాన్ మూవీ నడుస్తోంది.

సూపర్ హీరో కథను ఇతిహాసం తో ముడి పెట్టి దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఉత్తర అమెరికా లో ఈ సినిమా మూడు మిలియన్ల వసూళ్లు సాధించి సలార్, బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఇక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ సినిమాల జాబితాలో హనుమాన్ కూడా చేరింది. హనుమాన్ సినిమా వసూళ్లు వంద కోట్ల రూపాయలు చేరుకోవటంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆనందం వ్యక్త చేశారు. ఇది తన తొలి వంద కోట్ల సినిమా అని పేర్కొన్నారు.

Similar News