Full View'శీతాకాలం. మంచులో మనసులు తడిచి మద్దయ్యే కాలం.చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం. నా లైఫ్ లో శీతాకాలానికి మరో పేరు ఉంది. సీజన్ ఆఫ్ మ్యాజిక్. మనసుతో ప్రేమించాలంటే ముందు కళ్ళతో చూడాలి కదా. అలా నా కళ్లకు ఏ అమ్మాయి నచ్చినా తనే నా లైఫ్ పార్టనర్ అన్పిస్తుంది. స్కూల్ డేస్ లో కోమలి. వావ్..వాటే బ్యూటిఫుల్ స్మైల్. కాలేజ్ డేస్ లో అమ్ము ' అంటూ తన ప్రేమ కథలు చెబుతూ పోతాడు హీరో సత్యదేవ్.
ఇలా శీతాకాలం వచ్చిన ప్రతిసారి కొత్త కొత్త అందాలు మోసుకొచ్చి నాకు ఊపిరిఆడకుండా చేశాయ్ అంటాడు సత్యదేవ్. ఇవి అన్నీ గుర్తుందా శీతాకాలం సినిమా ట్రైలర్ లోని డైలాగులు. సత్యదేవ్, తమన్నాలు జంటగా నటించిన ఈ సినిమాట్రైలర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్ష
'హోదా'