గుంటూరు కారం రికార్డు వసూళ్లు

Update: 2024-01-19 06:34 GMT

గుంటూరు కారం చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది.ఒక ప్రాంతీయ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలివారంలో 212 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించటం అల్ టైం రికార్డు గా చెపుతోంది. ఈ మేరకు అధికారికంగానే హీరో మహేష్ బాబు తో కూడిన ఒక లుక్ విడుదల చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ బాబు కు జోడిగా శ్రీ లీల నటించింది.సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల విషయం తెలిసిందే. సినిమా చూసిన వారు అందరూ మహేష్ బాబు యాక్షన్ బాగున్నా కథలో దమ్ము లేకపోవటం మైనస్ గా మారింది అంటూ విమర్శలు చేశారు. అయినా సరే గుంటూరు కారం కలెక్షన్స్ మాత్రం కొత్త రికార్డు లు క్రియేట్ చేసినట్లు చిత్ర యూనిట్ చెపుతోంది. 

                            Full Viewఈ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. కానీ విడుదల తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. జనవరి పన్నెండునే విడుదల అయిన హనుమాన్ సినిమా విషయంలో దిల్ రాజు వ్యవహరించిన తీరు కూడా ఈ సినిమాపై నెగిటివ్ టాక్ రావటానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. డెమోలో తోడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన గత సినిమాల మూస ధోరణిలోనే సినిమాను తెరకెక్కించటం కూడా విమర్శలకు కారణం అయింది. 

Tags:    

Similar News