మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి రెండున అంటే ఈ గురువారం నాడు ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో జరగనుంది. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యే అవకాశం ఉంది. గత కొంత కాలంగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమా షూటింగ్ కోసం దేశంతో పాటు విదేశాల్లో పలు లొకేషన్స్ పరిశీలించి వచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కె ఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ అడ్వెంజరస్ మూవీ కు కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ సినిమా కోసమే మహేష్ బాబు గత కొంత కాలంగా న్యూ లుక్ తో సిద్ధం అయ్యారు. రాజమౌళి, మహేష్ బాబు ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా ఇదే. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.