Full Viewకీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లక్ సఖి'. వాయిదాల మీద వాయిదాల తర్వాత ఈ సినిమా ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబులు కీలక పాత్రలు పోషించారు. పక్కా పల్లెటూరి అమ్మాయిని షూటింగ్ లో నిపుణురాలిగా మార్చే కథతో ఈ సినిమా తెరకెక్కింది.
చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసిన ట్రైలర్ లో ఇవే సన్నివేశాలను చూపించారు. ఇందులో కీర్తి సురేష్ హావభావాలు..డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. జగపతిబాబు ఈ సినిమాలో కీర్తిసురేష్ కోచ్ గా కన్పించనున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.