తొలి రోజుతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రెండవ రోజు వసూళ్లు భారీ తగ్గాయి. ఏపీ, తెలంగాణాలో ఈ సినిమా రెండవ రోజు 13.35 కోట్ల రూపాయల గ్రాస్..7.73 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తొలి రోజు షేర్ 12.97 కోట్ల రూపాయలుగా ఉంది. రెండవ రోజు నైజాంలో 2.38 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 1.96 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. రెండు రోజులకు కలిపి గాడ్ ఫాదర్ సినిమా 34.75 కోట్ల రూపాయల గ్రాస్, షేర్ 20.70 కోట్ల రూపాయలు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రెండు రోజులకు కలుపుకుని 50.35 కోట్ల రూపాయల గ్రాస్ వస్తే..27.35 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.
మళయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ను చిరంజీవి హీరోగా తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, మురళీశర్మలు కీలక పాత్రలు పోషించారు. గాడ్ ఫాదర్ సినిమాకు ఓవరాల్ గా పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ళు మాత్రం వీక్ గానే ఉన్నాయి. ఈ రెండవ శనివారం, ఆదివారం నాడు వసూళ్లు కొంత పుంజుకునే ఛాన్స్ ఉందనే అంచనాలు ఉన్నాయి.ఆచార్య సినిమాతో పోలిస్తే అప్పటి కంటే సినిమా టిక్కెట్ ధరలు కాస్త తగ్గటం కూడా వసూళ్ళ లెక్కలపై ప్రభావం చూపిస్తున్నాయనే అభిప్రాయం ఉంది.