కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో సినిమాల జోరు పెరిగింది. పెద్ద..చిన్న సినిమాలు అన్నీ పట్టాలెక్కి షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. అందుకే పాత ట్రెండ్ కన్పిస్తోంది. ఈ ఆదివారం (డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన నటిస్తున్న నారప్ప సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. అందులోనే వెంకటేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళ సినిమా అసురన్ కు ఇది తెలుగు రీమేక్. ఇందులో వెంకీకి జోడీగా ప్రియమణి నటిస్తోంది. గ్లింప్స్ లో వెంకటేష్ చాలా సీరియస్ లో లుక్ లో కన్పిస్తారు.