Full View'ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్' అంటూ పంచ్ డైలాగ్ తో 'గని' సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో రామ్ చరణ్ వాయిస్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వహిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాకు అనుగుణంగా తన లుక్ మార్చుకుని చాలా కష్టపడ్డాడు.
ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గని సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో జగపతిబాబుతోపాటు ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కన్పించనున్నారు.