ప్రకృతికి ఏమి తెలుసు ఎవడు మంచోడే

Update: 2021-02-27 07:41 GMT

'గాలి సంపత్.' ఈ టైటిలే వెరైటీగా ఉంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సమర్ఫణతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం నాడు చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సరదా సరదాగా సాగింది. 'ప్రతి అమ్మాయికి డబ్బున్నోడు కావాలి లేదా..లేకపోతే ఫారెన్ వాడు కావాలి. డబ్బున్నోడు ఏమి ఇస్తాడే. డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడ నుంచి ఇస్తాడు.

ప్రపంచంలో ఏ తండ్రి తన కొడుకు ఎదగాలనుకుంటాడు. నువ్వేంటి నాన్నా నన్ను తొక్కి నువ్వు ఎదగాలనుకుంటున్నావు. ప్రకృతికి ఏమి తెలుసు ఎవడు మంచోడే..ఎవడు చెడ్డవాడో. 'వంటి ఆసక్తికర డైలాగ్ లతో సాగుతుంది ట్రైలర్. 'ఉషా ఫ్యాన్ లో నుంచి గాలి వచ్చినట్లు వీడి నోట్లో నుంచి మాట రాకుండా గాలి వస్తుంది ఏంటిరా?. అంటూ సాగే డైలాగ్ కూడా నవ్వు తెప్పిస్తుంది. శ్రీవిష్ణు హీరోగా..రాజేంద్రప్రసాద్ ఆయన తండ్రిగా నటించారు ఇందులో.

Full View

Tags:    

Similar News