ఎన్టీఆర్..కొరటాల శివ కొత్త సినిమా అప్ డేట్ వ‌చ్చేసింది

Update: 2022-05-19 14:05 GMT

Full Viewఅప్పుడ‌ప్పుడు ధైర్యానికి కూడా తెలియ‌దు. అవ‌స‌రానికి మించి త‌ను ఉండ‌కూడ‌దు అని. అప్పుడు భ‌యానికి తెలియాలి. త‌ను రావాల్సిన స‌మ‌యం వ‌చ్చింది అని. వ‌స్తున్నా' అంటూ ఎన్టీఆర్ చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ తో కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఎన్టీఆర్ 30వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. మే20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావ‌టంతో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుద‌ల చేసింది. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. యువ‌సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు. గ‌తంలో కొర‌టాల శివ‌, ఎన్టీఆర్ లు చేసిన జ‌న‌తా గ్యారెజ్ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్ని సాధించింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అయితే కొర‌టాల శివ నిర్మించిన ఆచార్య సినిమా మాత్రం నిరాశ‌ప‌ర్చింది. అయితే ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ మ‌ళ్ళీ హిట్ కొట్ట‌డం ఖాయం అన్న ధీమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు.

Tags:    

Similar News