Full Viewరవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'ఖిలాడీ'. బుధవారం నాడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఫుల్ కిక్ అంటూ సాగే పాటను విడుదల చేసింది. ఈ పాటలో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతిలు దుమ్మురేపారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్, అనసూయలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.