విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ది ఫ్యామిలీ స్టార్ . ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ ఐదున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే విషయాన్నీ వెల్లడిస్తూ న్యూ లుక్ విడుదల చేశారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. గీత గోవిందం తర్వాత పరశురామ్, విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే విడుదల అయిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది అని చెప్పాలి. ఖుషి సినిమా తర్వాత విజయ్ నటించిన మూవీ ఇదే. దీంతో అయన ఫ్యాన్స్ ది ఫ్యామిలీ స్టార్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ కొత్త తేదీతో దేవర వాయిదా పక్కా అని తేలిపోయింది.
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదు. దేవర సినిమా ముందు ప్రకటించినట్లు ఈ ఏప్రిల్ 5 న విడుదల అయ్యే ఛాన్స్ ఏ మాత్రం కనిపించటం లేదు. ఎందుకంటే దిల్ రాజు నిర్మాణ సంస్ధ తెరకెక్కించిన విజయదేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమాను ఏప్రిల్ ఐదున విడుదల చేయబోతున్నట్లు శుక్రవారం నాడు అధికారికంగా వెల్లడించారు. దీంతో దేవర పోస్టుపోన్ పక్కా అని తేలిపోయింది. వాస్తవానికి దేవర సినిమా విడుదల తేదీని చాలా ముందుగానే ప్రకటించారు. కానీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ప్రమాదానికి గురి అవటంతో పాటు...ఇతర పనులు పెండింగ్ లో ఉండటం వల్ల ఈ సినిమా ముందు ప్రకటించిన తేదికి వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా దేవరనే.