ఎఫ్3 సినిమా షూటింగ్ ప్రారంభం

Update: 2020-12-17 16:41 GMT

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ సందడి సినిమాకు సంబంధించి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తోంది. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా గురువారం నాడు ప్రారంభం అయింది. దర్శకుడు అనిల్‌ రావిపూడిడైరెక్షన్‌లో తెరకెక్కతున్నఈ సినిమా షూటింగ్‌ ప్రారంభ పూజ కార్యక్రమం గురువారం జరిగింది. హీరోయిన్‌ తమన్నా, హీరో వరణ్‌ తేజ్‌లపై ఓ సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి 'ఎఫ్ 3' సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎఫ్‌ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు 'ఎఫ్‌ 3'ని కూడా నిర్మించనున్నారు.

Tags:    

Similar News