అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ 2కి కొనసాగింపుగా ఎఫ్ 3 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ లు.వారికి జోడీగా తమన్నా, మెహరీన్ లు నటించారు. వీరితోపాటు ఈ సారి కొత్త నటులు కూడా చేరారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరి ఎఫ్ 2లాగే ఈ ఎఫ్ 3 ఎంత సంచలనం నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.