నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

Update: 2025-12-08 07:11 GMT

సినిమా పరిశ్రమలో ఉండే ఇగో లు కళ్ళకు కట్టినట్లు చూపించే మూవీ కాంత. తాను పరిశ్రమలోకి తీసుకొచ్చిన ఒక హీరో స్టార్ రేంజ్ కు వెళ్లిన తర్వాత ఏకంగా తనను పరిచయం చేసిన దర్శకుడికే కండిషన్స్ పెట్టిన తీరు. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న అపార్ధాలు...అనుమానాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇందులో. గత నెల 14 న బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా సక్సెస్ కాకపోయినా ప్రేక్షకుల నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ లో హీరో గా దుల్కర్ సల్మాన్ నటిస్తే...దర్శకుడిగా సముద్ర ఖని నటించారు.

                                     ఈ సినిమాలో హై లైట్ అంటే వీళ్లిద్దరి నటనే అని చెప్పొచ్చు. కొన్ని సార్లు దుల్కర్ సల్మాన్ ను సముద్ర ఖని డామినేట్ చేసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది ప్రేక్షకులకు. కాంత సినిమా కు సంబంధించి మరో కీలక విషయం ఏమిటి అంటే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కి ఈ సినిమా లో తన నటన ను ప్రూవ్ చేసుకునే పాత్ర దొరికింది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కు సహా నిర్మాతగా వ్యవహరించిన దగ్గుబాటి రానా కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News