ఆర్ఆర్ఆర్ దోస్తీ సంద‌డి షురూ

Update: 2021-08-01 05:47 GMT

Full Viewదోస్తీ మ్యూజిక్ వీడియో వ‌చ్చేసింది. ప్ర‌తిష్టాత్మ‌క సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి స్నేహితుల దినోత్స‌వం రోజున చిత్ర యూనిట్ దోస్తీ పాట‌ను విడుద‌ల చేసింది. తెలుగులో ఈ పాట‌ను హేమ‌చంద్ర పాడారు. ఈ వీడియో ప్రారంభంలో అంతా గాయ‌కుడు హేమ‌చంద్ర‌తోపాటు ఇత‌ర భాష‌ల్లో పాట పాడిన వారు ఉన్నారు. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ కీర‌వాణి కూడా సంద‌డి చేశారు. పాట చివ‌ర‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి అద‌ర‌గొట్టారు. ఈ పాట వీడియో చూస్తే రాజ‌మౌళి సినిమాల్లో ఉండే భారీ త‌నం స్ప‌ష్టంగా క‌న్పించింది. ఐదు నిమిషాల ఐదు సెక‌న్ల ఉన్న ఈ పాట ఆక‌ట్టుకునేలా ఉంది.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను ద‌స‌రాకు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్‌, కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ ఈ సినిమాలో క‌న్పించ‌నున్న విష‌యం తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాత‌గా ఉన్నారు.

Tags:    

Similar News