తొలిసారి అధికారికంగా స్పందించిన దర్శకుడు

Update: 2025-08-09 07:04 GMT

దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న మూవీ. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావటంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుంది అని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దర్శకుడు రాజమౌళి ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అదే సమయంలో ఒక ప్రీ లుక్ ను కూడా విడుదల చేశారు. 2025 నవంబర్ లో ఇప్పటి వరకు ఎవరూ చూడని రీతిలో ఈ సినిమా విషయాలు వెల్లడిస్తామని చెపుతూ రాజమౌళి దీనిపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు.

                                ఈ సినిమా స్టోరీ ...పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది అని..దీన్ని ఒక్క ఫోటో..ప్రెస్ కాన్ఫరెన్స్ తో చెప్పలేము అని రాజమౌళి తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ విశేషాలు తెలుసుకునేనేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రీ లుక్ లో యాష్ ట్యాగ్ గ్లోబ్ ట్రోటర్ అని రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా స్టోరీ ప్రపంచ యాత్రికుడిగా మహేష్ బాబు ను చూపించబోతున్నారు అనే సంకేతం ఇచ్చినట్లు అయింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీనిపై దర్శకుడు రాజమౌళి అధికారికంగా స్పందించటం ఇదే మొదటి సారి కావటం విశేషం. ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ రావటంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నారు అని చెప్పాలి.

Tags:    

Similar News