ప్రస్తుతం పక్కా లోకల్ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు మారుతి కొత్త సినిమాను ప్రకటించారు. కరోనా కష్టకాంలో మంచిరోజులొచ్చాయి అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. అంతే కాదు..ఆరోగ్య వంతమైన థియేటర్లలో అంటూ వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మంగళవారం నాడు విడుదల చేశారు.
ఈ సినిమాలో ఏక్ మినీ కథ సినిమాతో మంచి హిట్ అందుకున్న సంతోష్ శోభన్ హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఆయనకు జోడీగా ఈ సినిమాలో మెహరీన్ నటించనుంది. వి సెల్యులాయిడ్ నిర్మాణ సంస్థగా ఉంది. సాధ్యమైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే యోచనలో ఉన్నాడు దర్శకుడు మారుతి.