బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్ల రూపాయలపైన గ్రాస్ వసూళ్లను సాధించింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి టాక్ తో విజయం సాధించింది. ఇందులో బిచ్చగాడి గా ధనుష్ పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో..అదే రేంజ్ లో పారిశ్రామిక వేత్తగా కనిపించిన జిమ్ సర్బ్ పాత్రకు కూడా అంతే మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా లో రష్మిక పాత్ర అయితే గత సినిమా లకు భిన్నమైనది అని చెప్పొచ్చు.
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ దక్కించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. జులై 18 నుంచి ఇది ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కనిపెట్టిన ఆయిల్ రిజర్వు లను దక్కించుకునేందుకు ఆ పారిశ్రామికవేత్త వేసిన ప్లాన్ ఏంటి?. దీనికి అధికారంలో ఉన్న వాళ్లకు లక్ష కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించటానికి బిక్షగాళ్లను ఎందుకు మార్గంగా ఎంచుకున్నారు. నిజాయతిపరుడైన సిబిఐ ఆఫీసర్ గా ఉన్న నాగార్జున ఈ ఆపరేషన్ లోకి ఎందుకు వచ్చాడు అన్నదే ఈ కుబేర సినిమా.