కన్నడ, తమిళ్, మలయాళం బాక్స్ ఆఫీస్ ల దగ్గర కూడా దేవర వసూళ్లు నిలకడగా ఉన్నట్లు చెపుతున్నారు. అక్టోబర్ పదిన విడుదల అయ్యే రజని కాంత్ వేట్టైయాన్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హీరో ల సినిమాలు ఏమి లేవు. మరో వైపు దసరా సెలవులు కూడా మొదలు కానుండటంతో రాబోయ్ రోజుల్లో కూడా దసరా కలెక్షన్స్ జోష్ కొనసాగే అవకాశం ఉంది అనే లెక్కలు ఉన్నాయి. థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుంది అన్నది ఇప్పుడు కీలకం కానుంది.