ఆరు రోజులు...396 కోట్లు

Update: 2024-10-03 06:54 GMT

వరసగా మూడు రోజులు దేవర సినిమా వసూళ్లు ప్రకటిస్తూ వచ్చిన నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది. గురువారం నాడు మళ్ళీ మొత్తం ఆరు రోజుల వసూళ్ల లెక్కలు బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా దేవర మూవీ ఆరు రోజుల్లో 396 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలిపింది. పులితో కూడిన ఎన్టీఆర్ సీరియస్ లుక్ తో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఎన్టీఆర్ ఆర్ట్స్. తొలి మూడు రోజులు 304 కోట్ల రూపాయలు వస్తే...సోమ, మంగళ, బుధవారాల్లో ఈ సినిమాకు 92 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు లెక్క.

                                                             Full Viewవాస్తవానికి దేవర సినిమా విషయంలో డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండటం ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతోంది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద వరసగా కలెక్షన్స్ పెరగటం కూడా దేవర సినిమాకు కలిసి వచ్చింది అనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో గా చేసిన సినిమా ఇదే. అది కూడా ఆరేళ్ళ గ్యాప్ తర్వాత రావటంతో ఆయన ఫ్యాన్స్ మాత్రం సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News