దేవర అప్ డేట్ వచ్చింది

Update: 2024-01-01 08:19 GMT

ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర కు సంబంధించి న్యూ అప్ డేట్ వచ్చింది. కొత్త సంవత్సరం తొలి రోజు ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర యూనిట్. అదేంటి అంటే దేవర ఫస్ట్ పార్ట్ గ్లింప్స్ జనవరి 8 న విడుదల కానుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ న్యూ లుక్ ను కూడా విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదల కాబోతున్న ఎన్టీఆర్ సినిమా ఇదే కావటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గ్లింప్స్ తో మొదలు అయ్యే దేవర సందడి మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం రెండు భాగాలుగా దేవర ను తెరకెక్కిస్తున్నట్లు కొరటాల శివ గతంలోనే ప్రకటించారు. 

Tags:    

Similar News