ఎన్టీఆర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోష్

Update: 2024-09-24 14:27 GMT

Full Viewఎన్టీఆర్ దేవర మూవీ మరో రికార్డు సాధించింది. అమెరికాలో ప్రీమియర్ షోస్ ప్రీ సేల్స్ అమ్మకాల వసూళ్లే రెండు మిలియన్ డాలర్స్ దాటేశాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దేవర సినిమా పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ తో పాటు ఇప్పుడు ఎన్టీఆర్ సోలో మూవీ దేవర కూడా ఈ రికార్డు నమోదు చేయటం విశేషం.

                                                     అంతకు ముందు ఈ రికార్డు ప్రభాస్ హీరో గా నటించిన సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు సాధించాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం కాగా..అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆడిపోయేలా ఉన్నాయి. ఫస్ట్ డే తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అర్ధ రాత్రి ఈ సినిమా స్పెషల్ షోస్ కు రెండు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News