స్పీడ్ పెంచిన దేవర

Update: 2024-08-27 07:41 GMT

Full Viewఈ ఏడాది విడుదల కానున్న పెద్ద సినిమాల్లో దేవర ఒకటి. సరిగ్గా నెల రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

మంగళవారం నాడు చిత్ర యూనిట్ ఈ సినిమా కు సంబంధించి న్యూ లుక్ ను విడుదల చేసింది. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ పేరుతో విడుదల చేసిన ఈ లుక్ లో ఎన్టీఆర్ సీరియస్ లుక్ లో కనిపిస్తాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడి గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇది ఆమె తొలి తెలుగు సినిమా. కొరటాల తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News