ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే పది రోజులకు గాను దేవర 135 .85 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. పదవ రోజు వసూళ్లు ఆరున్న కోట్ల రూపాయలుగా ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు దేవర సక్సెస్ తో రెండవ పార్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. నెలన్నర రోజులు విశ్రాంతి తీసుకుని ఈ పని విషయంలో రంగంలోకి దిగాలని ఆయన్ను కోరినట్లు ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. దేవర విజయంతో తమపై బాధ్యత మరింత పెరిగింది అన్నారు.