అప్పుడే దేవర రికార్డు లు మొదలు

Update: 2024-09-10 05:45 GMT

సినిమా విడుదలకు ఇంకా పదిహేడు రోజుల సమయం ఉంది. ఇంతవరకు సినిమా ట్రైలర్ కూడా విడుదల కాలేదు. కానీ అప్పుడే ఎన్టీఆర్ , కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమా మాత్రం దుమ్మురేపుతోంది. అది ఎలా అంటారా. ఇప్పటికే ఉత్తర అమెరికా లో దేవర సినిమా టికెట్ ప్రీ సేల్స్ వసూళ్లు వన్ మిలియన్ ను దాటేశాయి. అంటే మన భారతీయ కరెన్సీ లో దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు లెక్క. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం సాయంత్రమే విడుదల కానుంది. ఇప్పటి వరకు అమెరికా ప్రీ సేల్స్ లో ఇంత వేగంగా వన్ మిలియన్ డాల్లర్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమా ఏది లేదు అని ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది.

                                              దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది దేవర దండయాత్ర అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న దేవర మొదటి పార్టీ సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల అయింది రెండు పాటలు కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. నార్త్ అమెరికా లో ఇప్పటికే అమ్మకాలు వన్ మిలియన్ డాలర్స్ దాటడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డు లు నమోదు చేస్తుందో అన్న ఆసక్తి సినిమా అభిమానుల్లో ..ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉంది.

Tags:    

Similar News