నాలుగు రోజులు...404 కోట్లు

Update: 2025-08-18 15:18 GMT

కూలీ సినిమా తో సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. తమిళ సినిమా చరిత్రలోనే కేవలం నాలుగు రోజుల్లోనే 404 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ మూవీ.ఈ జోష్ తో చిత్ర యూనిట్ రజనీకాంత్ రికార్డు మేకర్...రికార్డు బ్రేకర్ అంటూ ఒక న్యూ లుక్ ను షేర్ చేసుకుంది. ఆగస్ట్ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విషయంలో మిశ్రమ స్పందనలే వ్యక్తం అయినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డు వసూళ్లు సాధిస్తోంది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున విలన్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.

                               మరో కీలక పాత్రలో సౌబిన్ షాహిర్ దుమ్మురేపాడు. కూలీ సినిమాలో ఆయనకు స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉండటంతో పాటు మంచి కీలక పాత్ర దక్కింది. శ్రుతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన బాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. సౌబిన్ షాహిర్ తో పాటు మరో కీలక పాత్రలో నటించిన రచిత రామ్ కు కూడా ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి.

Tags:    

Similar News