ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ నటించిన సినిమా 'క్లాప్'. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి సోమవారం నాడు విడుదల చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది. కొంచెం టాలెంట్ ..రెండు కాళ్లు ఉంటే ఇక్కడ గెలిచేస్తారనుకుంటున్నావా అంటూ బ్రహ్మజీ హీరో ఆదితో చెప్పే డైలాగ్ లు. స్టేట్ లెవల్ లో గెలిచేస్తావు. అది పెద్ద విషయం కాదు. నేషనల్ లెవల్ లో ఒక్క గోల్డే ఉంటుంది అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్ లతో టీజర్ ఉత్కంఠ రేపేలా ఉంది. చాలా రోజుల తర్వాత ఆది పినిశెట్టి క్లాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.