చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం

Update: 2021-01-20 14:10 GMT

మెగాస్టార్ చిరంజీవి ఓ వైపు 'ఆచార్య' సినిమా షూటింగ్ చేస్తూనే కొత్త సినిమాకు రెడీ అయ్యారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను తెలుగులో చిరంజీవీ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇది చిరంజీవి 153వ సినిమా. బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్‌లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్ బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. "ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. ఇది మెగాస్టార్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది'అన్నారు.

ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ- 'చిరంజీవి తో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్‌లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News