సంక్రాంతి అంటే సినిమాల పండగ. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా టాప్ హీరోల సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. పైగా టాలీవుడ్ లో చాలా మంది టాప్ హీరో లకు సంక్రాంతికి తమ సినిమా వస్తే సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం కూడా ఉంటుంది. అందుకే ఈ డేట్ పై ఎక్కువ మంది ఫోకస్ పెడతారు. దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను 2027 జనవరి 13 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టిన రోజు కావటంతో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయటంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 158 వ సినిమాకు కాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం నాడు హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల మధ్య గ్రాండ్‌గా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సినిమా కూడా 2023 జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఈ కాకా మూవీ కి కూడా అదే డేట్ ఫైనల్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవికి మన శంకర వరప్రసాద్ గారు మూవీ తో సూపర్ డూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ల సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే "జనవరి 12 విడుదల" - బావ బామ్మర్ది సౌజన్యంతో అంటే టైటిల్ తో వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎప్పటిలాగానే వచ్చే సంక్రాంతి కూడా ఫుల్ ప్యాక్ మూవీ లతో సందడిగా మారనుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లోకి రాబోతున్నాయి.