Full Viewటాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా వెండి తెర హీరో లు బుల్లి తెరపై స్పెషల్ షోస్ చేసి విజయాలు సాధించిన వాళ్ళు ఎంతోమంది. బుల్లి తెరపైనే కాకుండా ఓటిటి లో కూడా కొంత మంది హీరో లు స్పెషల్ షోస్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో టాలీవుడ్ నుంచి మరో హీరో కూడా జాయిన్ అయ్యారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. మాస్ కే గ్రామర్..స్టైల్ కి నిర్వచనం అంటూ చిరంజీవితో మెగావర్స్ షో చేయనున్నట్లు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా సోషల్ మీడియా లో షేర్ చేసింది. మెగాస్టార్ ప్రత్యేక షో తో ఓటిటి ఎంట్రీ పై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ తో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ టాక్ షో ‘మెగావర్స్’ ని ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేశారు.
ఒక సిరీస్ గా దీనిని తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేయగా అతి త్వరలోనే ఈ సిరీస్ ని స్ట్రీమింగ్ కు సిద్ధం కానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర వరస విజయాలు అందుకుంటున్న చిరంజీవి చేసే ఫస్ట్ ఓటిటి షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీ తో కలిసి కాకా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి హీరో గా నటించిన విశ్వంభర సినిమా విడుదల తేదీ మాత్రం తేలటం లేదు. అసలు ఇది ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో కూడా ఎవరికీ అంతు చిక్కటం లేదు.