ఆచార్య సెట్ లో చిరంజీవి..చరణ్

Update: 2021-03-07 13:23 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వరస పెట్టి షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన షూటింగ్ లో చిరంజీవి, రామ్ చరణ్ లు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

Tags:    

Similar News