రెండు కొత్త సినిమాలతో చిరు రెడీ

Update: 2023-08-22 16:05 GMT

Full Viewఫలితాలతో సంబంధము లేకుండా మెగా స్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమా లు చేస్తూనే ఉన్నారు. ఈ ఎనిమిది నెలల కాలంలో చిరంజీవి నటించిన రెండు సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య విడుదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆగస్ట్ 11 న విడుదల అయిన భోళా శంకర్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గత 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్ల రూపాయల గ్రాస్, 22 .50 కోట్ల రూపాయల షేర్ సాధించింది. బ్రేక్ ఈవెన్ సాదించాలంటేనే ఇంకా 53 కోట్ల రూపాయలు సాధించాల్సి ఉంది అని టాలీవుడ్ టాక్. అది జరిగే పని కాదు..దీంతో ఇది డిజాస్టర్ గా మిగిలిపోనుంది.

                                        మంగళవారం నాడు చిరంజీవి పుట్టిన రోజు కావటంతో రెండు కొత్త సినిమా ప్రకటనలు వచ్చాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ చిరంజీవి 156 సినిమాను నిర్మించనుంది. మరో సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. బింబిసార సినిమా దర్శకుడు వశిష్ట ఈ సినిమా కు దర్శకత్వం వహించనున్నారు. ఇది చిరంజీవి 157 సినిమా. ఈ పోస్టర్ పై ఉన్న విశ్వానికి మించి అన్న టాగ్ లైన్ తో పాటు లుక్ కూడా దీనిపై అందరిలో ఆసక్తి పెంచేలా ఉంది అనే చెప్పాలి. గత అనుభవాల దృష్ట్యా చిరంజీవి కొత్త సినిమా ల కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు.

Tags:    

Similar News