కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న సినిమానే 'చావు కబురు చల్లగా' సినిమా. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ సినిమాలో కార్తికేయ 'అంతిమయాత్ర' వాహనం నడిపే డ్రైవర్ గా నటించాడు. ఫుల్ మాస్ మసాలతో సినిమాను దట్టించినట్లు కన్పిస్తోంది. 'ఎవరు కావాలి మీకు. ఎవరు వచ్చినా పర్వాలేదు. అట్టుకెళ్లిపోతాం. ఎక్కడకు అట్టుకెళ్లిపోతారు. అంతిమయాత్రకు అండీ. అయ్య బాబోయ్ మీరు తేడాగా మాట్లాడుతున్నారు.' అనే డైలాగ్ తో చావు కబురు చల్లగా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత లావణ్య త్రిపాఠి నిన్ను నేను కాదు..ప్రపంచంలో ఏ అమ్మాయి పెళ్ళి చేసుకోదు. నువ్వు నెంబర్ వన్ వెదవవు అంటూ కార్తికేయకు వార్నింగ్ ఇస్తుంది. అమ్మాయిలకు ఎలాగూ వెధవలే నచ్చుతారంటగా..మరి నేను నెంబర్ వన్ అయినప్పుడు నన్ను మించిన ఆప్షన్ ఏమి ఉంటుంది అంటే..పిచ్చినాకొడకా అంటూ వెళ్లిపోతుంది లావణ్య త్రిపాఠి. ఇలాంటి విచిత్రమైన డైలాగులు ఎన్నో ఉన్నాయి ఈ ట్రైలర్ లో. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.