బస్టాండే బస్టాండే అంటున్న నితిన్

Update: 2021-02-27 08:24 GMT

హీరో నితిన్ కొత్త సినిమా 'రంగ్ దే'. కీర్తిసురేష్, నితిన్ జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ఈ సినిమాకు సంబంధించి శనివారం నాడు చిత్ర యూనిట్ ' బస్టాండే..బస్టాండే' పాటను విడుదల చేసింది. ఈ పాట సరదా సరదాగా సాగుతోంది. పెళ్ళి అయిన తర్వాత తన కష్టాలను వివరిస్తూ నితిన్ ఈ పాట అందుకుంటే...కీర్తిసురేష్ కవ్విస్తూ నితిన్ ను మరింత ఉడికిస్తుంది. ఈ పాట విదేశాల్లో చిత్రీకరణ సాగింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి 26న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.Full View 

Tags:    

Similar News