అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. అంతే కాదు దుబాయ్ లో ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. అలాంటి బుర్జ్ ఖలీఫాపై ఓ నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటం అంటే ఖచ్చితంగా ఓ విశేషమే. ఇప్పుడు అదే జరిగింది. సోమవారం నాడు పుట్టిన రోజు జరుపుకున్న షారుఖ్ ఖాన్ కు బుర్జ్ ఖలీఫా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై షారుఖ్ ఖాన్ స్పందించారు. అతి పెద్ద, అతి పొడవైన స్క్రీన్ పై ఇలా చూసుకోవటం ఆనందంగా ఉందన్నారు. తన పిల్లలు కూడా ఇది చూసి ఎంతో సంతోషించారని ఈ ఫోటో షేర్ చేశాడు షారుఖ్ ఖాన్.