పెళ్ళి సందడి 'బుజ్జులు..బుజ్జులు' సాంగ్ విడుదల

Update: 2021-05-23 14:56 GMT

రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పెళ్ళి సందడి' సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు. ఆ పెళ్లి సందడిలో హీరోగా శ్రీకాంత్, దీప్తిభట్నాగర్, రవళి హీరోయిన్లుగా నటించారు. ఈ పెళ్లి సందడిలో అప్పటి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ పెళ్లి సందడికి కూడా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.

కొత్త పెళ్లి సందడి సినిమాకు సంబంధించి 'బుజ్జులు.బుజ్జులు' పాటను చిత్ర యూనిట్ ను ఆదివారం నాడు విడుదల చేసింది. రాఘవేంద్ర రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. పెళ్ళి సందడికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని లు నిర్మాతలు.

Full View

Tags:    

Similar News