తాజాగా మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ బాయ్ కాట్ పిలుపు వల్ల నష్టపోయింది ఒక్క అమీర్ ఖాన్ మాత్రమే కాదు..ఈ సినిమా కోసం పనిచేసిన వేలాది మంది అంటూ కామెంట్ చేశారు. ఇదే ఇప్పుడు ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అమీర్ ఖాన్ కు..లాల్ సింగ్ చద్దాకు అనుకూలంగా మాట్లాడటంతో లైగర్ సినిమాను కూడా బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం కూడా ట్రెండింగ్ గా మారింది. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ లైగర్ బాయ్ కాట్ ట్రెండింగ్ సినిమా కలెక్షన్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో వేచిచూడాల్సిందే. విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎవరి మద్దతు లేకుండా తమ హీరో పరిశ్రమలో నిలదొక్కుకున్నారని..ఇలా చేయటం సరికాదంటూ లైగర్ కు మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. మరి ఈ వ్యతిరేక, అనుకూల వర్గాల ప్రచారాలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచిచూడాల్సిందే. కరణ్ జోహర్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరుగా ఉండటం కూడా లైగర్ పై వ్యతిరేక ప్రచారానికి ఓ కారణంగా చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటంచిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.