ఎన్టీఆర్. రామ్ చరణ్. ఇద్దరూ డ్యాన్స్ ల్లో సూపర్ ఫాస్ట్. స్టెప్పులు కూడా ఇరగదీస్తారు. నటనలో ఎవరి స్టైల్ వారిది అయినా..డ్యాన్స్ ల్లో మాత్రం ఇద్దరూ స్పీడ్ ఉన్నోళ్లే. అలాంటి స్పీడ్ ఉన్న ఇద్దరూ డ్యాన్సర్లు ఒకేసారి మాంచి మాస్ బీటున్న పాటకు డ్యాన్స్ వేస్తే. ఇక ఫ్యాన్స్ కు పండగే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అదే జరగబోతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ అదరగొట్టే స్టెప్పులతో ఓ పాట నవంబర్ 10న బయటకు రానుంది. బ్లాస్టింగ్ బీట్స్..హైఓల్టేజ్ డ్యాన్స్ నెంబర్ వస్తోంది అంటూ చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. గత కొంత కాలంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది.
జనవరి 7న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో అప్పటికే దీనిపై అంచనాలను ఓ రేంజ్ తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. దర్శకుడు రాజమౌళి సినిమాను తెరకెక్కించటంలోనే కాదు..ప్రమోషన్లలోనూ తనదైన స్టైల్ చూపిస్తూ అందరూ దీని గురించే మాట్లాడుకొనేలా చేయటంలో సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు కూడా అదే మోడల్ ను పాలో అవుతున్నారు. గతంలో ఎవరూ చేయనిరీతిలో పీవీఆర్ థియేటర్స్ తో ఒప్పందం చేసుకుని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పీవీఆర్ స్క్రీన్లకు పీవీ ఆర్ఆర్ఆర్ బ్రాండింగ్ చేసిన విషయం తెలిసిందే.