'కిక్కు'ట‌న్నుల‌కొద్దీ అంటున్న నాగార్జున‌

Update: 2021-09-05 06:31 GMT

ప్ర‌తి ఏటా మా టీవీ నిర్వ‌హించే బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నాడు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. ఈ సారి కూడా అక్కినేని నాగార్జునే ఈ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తొలి రోజు షో అదిరిపోయేలా నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి బిగ్ బాస్ 5 సీజన్ లో 'కిక్కు'ట‌న్నుల‌కొద్దీ ఉంటుందంటున్నారు నాగార్జున‌. ప్రారంభ షోలో హంగామా వేరే లెవ‌ల్ లో ఉండేలా ప్లాన్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియోను విడుద‌ల చేశారు. అయితే ఈ సారి షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవ‌రు అనే చ‌ర్చ ఎప్ప‌టి నుంచో సాగుతోంది. అయితే ఆ జాబితా ఇదుగో అంటూ సోష‌ల్ మీడియాలో ఓ లిస్ట్ విప‌రీతంగా స‌ర్కులేట్ అవుతోంది. అదే ఈ జాబితా.. ఇందులో అస‌లు షోలో ఎంత మంది ఉంటారు..ఎవ‌రు ఉండ‌రు అన్న విష‌యం ఆదివారం రాత్రికి తేలిపోనుంది. అన‌ధికార జాబితా అయితే మాత్రం ఇదే..

Full View

1.యాంకర్ రవి

2. విశ్వ (సీరియల్ నటుడు)

3.సరయు (7 arts)

4.నటరాజ్ (డాన్స్ మాస్టర్)

5.అని (డాన్స్ మాస్టర్)

6.లోబో

7.మానస్

8.ఉమాదేవి

9.జశ్వంత్

10.ప్రియాంక

11.VJ సన్నీ

12.RJ కాజల్

13.సిరి

14.షన్ముఖ్

15.ప్రియా

16.శ్వేతా వర్మ

17.శ్రీరామ చంద్ర

18.లహరి శ్రీ

19.ఫరీదా సింగర్

Tags:    

Similar News