బిగ్ బాస్ తెలుగు సీజన్ ను వివాదాలు ఎన్ని చుట్టుముడుతున్నారేటింగ్ విషయంలో మాత్రం ఈ షో తన సత్తాను చాటుతూనే ఉంది. ఈ సారి కూడా నాగార్జునే ఈ షోను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఐదో సీజన్‌లోనూ నాగార్జున రేటింగ్స్ పరంగా తన మార్క్ చాటాడు. షోలో కొత్తదనం ఏమీలేకపోయినా రేటింగ్స్ మాత్రం ఆశాజనంగానే ఉన్నాయి. సీజన్ 5 ప్రారంభ ఎపిసోడ్ కు 18 టీఆర్పీ వచ్చింది. ఈ విషయాన్ని నాగ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ సెప్టెంబర్ 5న ఎంతో ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యతను స్వీకరించాడు. బుల్లితెర ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానంటూ మురిపించాడు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ తొలి సీజన్‌ను విజయవంతంగా నడిపించిన విషయం తెలిసిందే. అందుకే అప్పట్లో లాంచ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌లో తొలి ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ వచ్చింది. అయితే మూడో సీజన్‌కు తాను హోస్ట్‌గా వ్యవహరించలేనని నాని చేతులెత్తేయడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు కింగ్ నాగార్జునను సంప్రదించారు. ఇందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.నాగ్ ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టిన మూడవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు అనూహ్యంగా 17.92 టీఆర్పీ రేటింగ్ దక్కింది. తర్వాత నాగ్ మరోసారి బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాలుగో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు ఐదవ సీజన్ లో 18 టీవీఆర్ తో నిలిచాడు.