బిగ్ బాస్ 'అరగుండు డీల్'

Update: 2020-10-17 09:50 GMT
బిగ్ బాస్ అరగుండు డీల్
  • whatsapp icon

ఎంటర్ టైన్ మెంట్ సంగతి ఏమో కానీ..బిగ్ బాస్ చూసేవాళ్లకు చాలా సార్లు ఏవగింపు వస్తోంది. బురదలో ఏదో వస్తువులు వేసి..వాటిని బయటకు తీయమనటం..బాటిళ్ళకు బాటిళ్లు డ్రింక్ లు తాగమనటం వంటి విచిత్రమైన టాస్క్ లు ఎన్నో బిగ్ బాస్ లో వస్తుంటాయి. ఈ సారి మాత్రం చాలా దారుణమైన డీల్ పెట్టారు. అదేంటి అంటే ఎవరు అయితే అరగుండు చేయించుకోవటానికి సిద్ధపడతారో వారిని తదుపరి నామినేషన్ నుంచి మినహాయింపు కల్పించనున్నట్లు బిగ్ బాస్ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు.

ఇప్పుడు చాలా పెద్ద ఆఫర్ ఇస్తున్నా. హాఫ్ షేవ్. మీలో ఎవరికన్నా ముందుకొచ్చి ఆ డీల్ చేశారనుకుంటే..కెప్టెన్సీ పోటీదారులు కాదు..తదుపరి వారం నామినేషన్ నుంచే సేఫ్ అని ప్రకటించారు. అమ్మ రాజశేఖర్ దీనికి సిద్ధపడి అరగుండు చేయించుకుంటారు. హౌస్ సభ్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్పినా కూడా అమ్మరాజశేఖర్ ఓకే చెప్పటంతో మరో సభ్యుడు నోయల్ ట్రిమ్మర్ తీసుకొచ్చి అమ్మరాజశేఖర్ కు అరగుండు చేసేస్తారు. దీనికి సంబంధించిన కార్యక్రమం శనివారం రాత్రి ప్రసారం కానుంది.

Tags:    

Similar News