నాకు హద్దులు లేవు...సరిహద్దులు లేవు

Update: 2023-06-24 14:22 GMT

Full Viewమెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు హిట్ ట్రాక్ లో ఉన్నారు. గాడ్ ఫాథర్, వాల్తేర్ వీరయ్య లు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి భోళా శంకర్ అంటూ ఆగష్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం భోళా శంకర్ టీజర్ విడుదల చేసింది. టీజర్ చూస్తే చిరంజీవికి హ్యాట్రిక్ విజయం ఖాయం అంటూ ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారనే చెప్పాలి. మాస్ యాక్షన్ సన్నివేశాలు...పొలిటికల్ డైలాగులు సినిమాపై అంచనాలు పెంచాయనే చెప్పాలి.

‘ మొత్తం 33 మందిని చంపేశాడు. ఒక్కడా. ఏక్ ఆద్మీ. హౌ. ఎవరు నువ్వు. షికారు చేస్తున్న సింహం బే’ అంటూ టీజర్ సాగుతుంది. ఇందులో ఏ భోళా ఇది నా ఏరియా అని విలన్ అంటే ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్ళే. అన్ని ఏరియా లు నావే ..నాకు హద్దులు లేవు...సరిహద్దులు లేవు ఆగష్టు 11 న చూసుకుందాం అంటూ చిరంజీవి చెప్పే డైలాగు ఇందులో హై లైట్ గా ఉంది అనే చెప్పాలి. మెహెర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా తమన్నా నటిస్తుంటే....అయన సోదరిగా మరో కీలక హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళం లో సూపర్ హిట్ అయినా సినిమా వేదాళం కు రీమేక్ సినిమానే ఈ భోళా శంకర్.

Tags:    

Similar News