Full Viewప్రముఖ దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా బీమ్లానాయక్ చిత్ర యూనిట్ కొత్త పాటను విడుదల చేసింది. ఈ 'లాలా బీమ్లా' పాట పవన్ ఫ్యాన్స్ ను ఫుల్ కుషీగా చేస్తోంది. ఆకట్టుకునేలా సాగింది ఈ పాట. మళయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నిత్యామీనన్,సంయుక్త మీనన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాతో తొలిసారి పవన్, రానాలు కలసి నటిస్తున్నారు.