Full Viewబీమ్లానాయక్ చిత్ర యూనిట్ మంగళవారం నాడు దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్ర డేనియల్ శేఖర్ కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో రానా ..అరిస్తే భయపడతామా..వాడికంటే గట్టిగా అరుస్తా..ఎవడాడు..ఆఫ్ట్రాల్ ఎస్ ఐ అంటూ చాలా సీరియస్ గా డైలాగ్ లు చెబుతాడు. అంతకు ముందు విడుదల చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే టెంపోలో రానా ను ఉద్దేశించి సీరియస్ డెలాగ్ లు చెబుతాడు.
ఈ రెండూ చూస్తే బీమ్లానాయక్ లో ఇద్దరి మధ్య మంచి ఇంటెన్సిటి ఉన్న సీన్లు ఆలరించబోతున్నాయనే అంచనాలకు వస్తున్నారు అభిమానులు. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. ఈ సినిమాకు కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.