Full Viewవకీల్ సాబ్. ఇప్పుడు 'బీమ్లానాయక్'. ఆ తర్వాత హరిహర వీరమల్లు. ఇంకా పట్టాలెక్కాల్సిన సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా...సినిమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ సందడి ఓ రేంజ్ లో ఉండబోతుంది. ఆదివారం నాడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించకుని టైటిల్ ను..ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ను 'బీమ్లానాయక్'గా ఖరారు చేశారు ఈ ఫస్ట్ గ్లింప్స్ లో 'ఒరేయ్ డేనీ.. బయటకు రారా' అంటూ పవన్ ఫైట్‌తో స్టార్ట్ కాగా.. లుంగి, బ్లాక్ షర్ట్‌తో ఇచ్చిన పవన్ ఎంట్రీ అభిమానుల్లో ఉత్సాహం నింపేదిలా ఉంది. 'డేని.. డేనియల్ శేఖర్' అని రానా తన పేరు చెప్పగానే.. 'భీమ్లా..భీమ్లా నాయక్.. ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా!! అక్కర్లేదు బండెక్కు' అంటూ పవర్‌స్టార్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజుమేనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్ భీమ్లానాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. బీజుమేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్, పృథ్వీరాజ్‌కుమార్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక నిత్యామీనన్, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.