సేనాపతి ఈజ్ బ్యాక్

Update: 2024-06-25 16:04 GMT

Full Viewప్రస్తుతం దేశంలో అంతటా కల్కి ఫీవర్ కొనసాగుతోంది. అందరి కళ్ళు జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపైనే ఉన్నాయి. కల్కి విడుదల అయిన సరిగ్గా పదిహేను రోజులకు భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి సినిమాలో కూడా కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తే...భారతీయుడు 2 సినిమా అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది. సంచలన దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు సంబదించిన ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదల అయింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి అనే చెప్పాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. పవర్ ఫుల్ డైలాగులతో భారతీయుడు ట్రైలర్ నిండి ఉంది.

                                                   ఇందులో కమల్ హాసన్ డిఫరెంట్ లుక్స్ కూడా అదరగొట్టేలా ఉన్నాయి. సిద్దార్థ్ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సేనాపతిగా కమల్ హాసన్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎక్కడా రాజీపడకుండా సినిమాను రిచ్ గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. వచ్చే నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారతీయుడు 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డు లు నమోదు చేస్తుందో చూడాలి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే కమల్ హాసన్ నటించిన రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

Tags:    

Similar News