కమల్, శంకర్ సినిమా డేట్ ఫిక్స్

Update: 2024-04-06 13:52 GMT

కమల్ హాసన్ హీరో గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంత సెన్సషనల్ హిట్ మూవీ గా నిలిచిందో అందరికి తెలిసిందే. భారతీయుడు సినిమా 1996 లో విడుదల అయింది. ఈ సినిమా లో కమల్ హాసన్ కు జోడిగా మనీషా కోయిరాలా, ఊర్మిళ లు నటించారు. భారతీయుడు విడుదల అయిన 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతీయుడు 2 విడుదల అవుతోంది. చిత్ర యూనిట్ ఈ సినిమా ను 2024 జూన్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

                                         భారతీయుడు 2 లో కమల్ హాసన్ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. భారతీయుడు సినిమాలో భారీ తారాగణం కనిపించనుంది. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళ్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనే చెప్పొచ్చు. మరి ఈ భారతీయుడు 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం దక్కించుకుంటోందో వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News