కార్తికేయ కొత్త సినిమా ఓటిటిలోకి

Update: 2024-06-24 16:28 GMT

Full Viewమే నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు అన్ని వరసగా ఓటిటి కి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా ఓటిటి లోకి రాగా..ఇప్పుడు భజే వాయు వేగం మూవీ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ రెండు సినిమా లు మే 31 న విడుదల అయిన విషయం తెలిసిందే. భజే వాయు వేగం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. కార్తికేయ హీరో గా నటించిన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటిటి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

                                           జూన్ 28 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా ప్రకటించారు. భజే వాయు వేగం సినిమాలో కార్తికేయ కు జోడిగా ఐశ్వర్య మీనన్ నటించింది. యువి క్రియేషన్స్ తెరకెక్కించిన ఈ మూవీ కి రధన్ సంగీతం అందించారు. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News