ముగ్గురు హీరోల మూవీ ఎక్కడో తెలుసా?!

Update: 2025-07-08 07:19 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచి మనోజ్, నారా రోహిత్ లు కలిసి నటించిన సినిమా భైరవం. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీ మే 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ సినిమా కు రీమేక్ గానే ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొంత మేర మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమా లో ముగ్గురు హీరో ల రోల్స్..యాక్షన్ బాగున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా లో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై లు నటించారు.

                                       బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. జులై 18 నుంచి ఇది జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించారు. వేల కోట్ల రూపాయల విలువైన దేవుడి గుడి భూములపై ఒక మంత్రి కన్నుపడటం... ఈ భూములను కాపాడే క్రమంలో ఈ ముగ్గురు హీరో లు ఏమి చేశారు అన్నదే ఈ మూవీ. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News